“రాధే శ్యామ్”లో ప్రభాస్ షూట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 16, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. ఎప్పుడో సినిమా పూర్తయిపోయింది అనుకున్న ఈ చిత్రంపై ఇంకా కాస్త షూట్ బ్యాలన్స్ ఉందని దర్శకుడు రాధా కృష్ణ ఇచ్చిన ట్విస్ట్ కు ఒక్కొక్కరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఎలాగో మళ్ళీ ఈ చిత్రం షూట్ లో పాల్గొనేందుకు ప్రభాస్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు.

అయితే ప్రభాస్ పై ఇంకా ఎన్ని రోజులు షూట్ బ్యాలన్స్ ఉంది అన్న దానిపైనా లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ప్రభాస్ ఈ చిత్రానికి గాను ఇంకా పది రోజులు షూట్ లో పాల్గొనాల్సి ఉందట. ఇదే ఫైనల్ షెడ్యూల్ అని ఇక అది అయ్యిపోతే ఎంటైర్ షూట్ కంప్లీట్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ పీరియాడిక్ వండర్ ను నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :