“పుష్ప” పార్ట్ 1లో బాలన్స్ ఇంతేనా.!?

Published on May 15, 2021 4:09 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆల్రెడీ భారీ అంచనాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నిన్ననే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని నేషనల్ లెవెల్లో కన్ఫర్మ్ కూడా అయ్యిపోయింది. అలాగే ఈ రెండు పార్టులకు సంబంధించి కూడా పలు ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి.

అయితే పుష్ప పార్ట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు సహా పాట మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇవి కాస్తా అయ్యిపోతే రెండో పార్ట్ లో బ్యాలన్స్ షూట్ ను కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా షురూ చేసేస్తారట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :