“రాధే శ్యామ్” అక్కడి బిజినెస్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 28, 2021 11:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ బడ్జెట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంకా కొంత షూట్ చేసుకోవాల్సి ఉంది. అయితే అది ఇంకా కంప్లీట్ కాకుండానే కరోనా వల్ల వాయిదా పడాల్సి వచ్చింది. మరి ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వ్యవహారాలు జరిగిపోతున్నట్టు టాక్.

అలా ప్రస్తుతం ఓవర్సీస్ బిజినెస్ కు సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం అక్కడి థియేట్రికల్ హక్కుల కోసం పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడి బిజినెస్ 3.5 మిలియన్ డాలర్స్ నుంచి 4 మేర జరగనున్నట్టుగా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :