లేటెస్ట్ బజ్..”రాధే శ్యామ్” టార్గెట్ మారిందా.?

Published on Jun 6, 2021 10:40 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లారెడీ కంప్లీట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇంకా కొన్ని రీ షూట్స్ ఉండగా వాటని పది రోజుల్లో మేకర్స్ కంప్లీట్ చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ మూలాన అది కాస్తా వాయిదా పడాల్సి వచ్చింది.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే జూలై 30న విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అది దాదాపు వాయిదా పడేలా ఉందని మళ్ళీ సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రం వచ్చే దసరా సీజన్లోకే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం ఈ టాక్ బయటకి వచ్చింది మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :