రామ్ చరణ్ వింత కోరిక.. ఆలోచనలోపడిన శంకర్ ?

Published on Apr 20, 2021 5:14 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ శంకర్ సినిమా. ఏమాత్రం ముందస్తు హడావుడి లేకుండానే ఈ సినిమా సెట్టైపోయింది. కథ చర్చలు ముగియడమే ఆలస్యం నిర్మాత దిల్ రాజు సినిమాను ప్రకటించేశారు. శంకర్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడం చాలా అరుదు. అలాంటిది చెర్రీతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా సబ్జెక్ట్ కంప్లీట్ పొలిటికల్ అని అంటున్నారు. అంతేకాదు తండ్రీ కొడుకుల కథ అని కూడ టాక్ ఉంది.

ఈ వార్తలు ఇలా ఉంటే చరణ్ శంకర్ ను వింత కోరిక ఒకటి కోరాడట. అదేమిటంటే కొడుకు పాత్రతో పాటు తండ్రి పాత్రను కూడ తానే చేస్తానని అన్నారట. దీంతో ఆలోచనలోపడిన రామ్ చరణ్ కు 50 ఏళ్ల తండ్రి పాత్రకు లుక్ టెస్ట్ చేయడానికి రెడీ అయ్యారట. అందులో చెర్రీ గనుక శంకర్ ను సంతృప్తిపరచగలిగితే తండ్రి, కొడుకు రెండు పాత్రలు చెర్రీతోనే చేయిస్తారట. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇకపోతే చరణ్ ‘ఆచార్య, ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలు ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టే యోచనలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :