“RRR” షూట్ అండ్ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్..!

“RRR” షూట్ అండ్ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్..!

Published on Aug 12, 2021 11:00 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న “రౌద్రం రణం రుధిరం” చిత్రం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. టీం అంతా వెళ్లినా కూడా ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ మాత్రం ఆగడం లేదు. ఒక ప్రాసెస్ లో షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

ముందు అనుకున్న దాని ప్రకారం ఈ వారంలోనే కంప్లీట్ అవ్వాల్సిన ఈ చిత్రం మరో వారం రోజులు పాటు అక్కడ షూటింగ్ ని కొనసాగించుకోనుందట. అలాగే ఆ షూట్ ముగించుకున్నాక ఇక్కడికి వచ్చి మళ్ళీ రిలీజ్ డేట్ పై అధికారిక క్లారిటీ ఇవ్వనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. దీనిపై ఓ ప్రెస్ మీట్ ద్వారా తుది క్లారిటీ మేకర్స్ ఇవ్వనున్నారని సినీ వర్గాల్లో టాక్. మరి పాన్ ఇండియన్ లెవెల్లో చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు