‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ అదేనా..?

Published on Oct 6, 2019 2:00 pm IST

రాజమౌళి తాను డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించారు. దీంతో ఔత్సాహికులు చాలామంది తమకు తోచిన పేర్లను సజెస్ట్ చేశారు. అన్నిటినీ పరిశీలించిన రాజమౌళి అండ్ టీమ్ చివరికి ఒక పేరును బలంగా పరిశీలిస్తున్నారని టాక్.

అదే ‘రామ రౌద్ర రౌషితం’. ఈ పేరే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయట. ఇక ఇతర భాషల కోసం ‘రైజ్ రివొల్ట్ రివెంజ్’ అనే టైటిల్ పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదలచేయనున్నారు.

ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్ర చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More