“బిగ్ బాస్” తెలుగు సీజన్ 5 లేటెస్ట్ బజ్.!

Published on Jun 15, 2021 6:00 pm IST

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న భారీ రియాలిటీ షో బిగ్ బాస్.. అన్ని భాషలతో పాటుగా మన తెలుగులో కూడా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనితో ఐదవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సీజన్ పై పలు ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి.

మరి వాటిలో హోస్ట్ గా కింగ్ నాగ్ నే మళ్ళీ హోస్ట్ గా చెయ్యనున్నారు అనే టాక్ తో పాటుగా లేటెస్ట్ బజ్ ఇంకోటి బయటకి వచ్చింది. మరి దాని ప్రకారం ఈ షో అనుకున్న సమయానికి రాకపోవచ్చట.

నిజానికి జూలై నాటికి అలా ప్లాన్ చేసిన ఈ సీజన్ పలు కారణాల చేత సెప్టెంబర్ కానీ అక్టోబర్ కి కానీ షిఫ్ట్ అయ్యినట్టు నయా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. అలాగే ఈ సారి సీజన్లో ఎలాంటి సెలెబ్రెటీస్ కనిపించనున్నారో అన్న దానిపై కూడా మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :