‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ రిలీజ్ కన్ఫర్మ్ అయింది ?

Published on May 13, 2021 1:01 am IST

అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో మొదటిసారి భారీ లెవల్లో విజయం సాధించిన వెబ్ సిరీస్ ఇదే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సీక్వెల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ పలు కారణాల రీత్యా వాయిదాపడింది. ఈ 2021 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు సెకండ్ సీజన్ జూన్ 11వ తేదీన విడుదలవుతుంది తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ డబ్బింగ్ పనులు కూడ పూర్తయ్యాయట. కాబట్టి జూన్11న పార్ట్2 హిందీలో విడుదలైతే ఇతర భాషల్లో కూడ అదే రోజున రూలీజ్ అవుతుంది. ఈ సెకండ్ సీజన్లో సమంత అక్కినేని ఒక కీలక పాత్ర చేయడం జరిగింది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :