యష్ నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jun 19, 2021 11:02 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ తన కేజీయఫ్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ లెవెల్ ఫేమ్ ను తెచ్చుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం యష్ ఎలాంటి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు ఎవరితో చేస్తాడు అన్న దానిపై చాలా కాలం నుంచి సస్పెన్స్ ఉంది. అయితే కేజీయఫ్ తర్వాత యష్ ఇమేజ్ ని మ్యాచ్ చేసే కథలతో ఎవరూ లేరని కూడా మరో టాక్ ఉన్న నేపథ్యంలో కన్నడ టాలెంటెడ్ దర్శకుడు నర్తన్ ఓ సాలిడ్ స్క్రిప్ట్ చేసాడని గత కొంత కాలం నుంచి బజ్ ఉంది.

మరి ఈ కాంబో పైనే లేటెస్ట్ బజ్ మరొకటి వినిపిస్తుంది. వీరి కాంబోలో సినిమా అయితే ఉంది కానీ యష్ ఒక నావికా దళ నాయకుడిగా కనిపిస్తాడు అన్న దాంట్లో ఎలాంటి నిజమూ లేదని తెలుస్తుంది. అలాగే మరో టాక్ కూడా వినిపిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో యష్ సరసన నటించనుంది అని మరో గాసిప్ బయటకి వచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :