“మహేష్ 28” టైటిల్స్ పై క్లారిటీ.!

Published on May 16, 2023 4:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ గా పలు ఇంట్రెస్టింగ్ అండ్ క్లాస్, మాసీ టైటిల్స్ కొన్ని వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఈ చిత్రం నుంచి మే లో భారీ ట్రీట్ రానుండగా ఈ టైటిల్ పై అయితే క్లారిటీ తెలుస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఏ టైటిల్ కూడా నిజం కాదు అన్నట్టు తెలుస్తుంది. మరి ఇవి కాకుండా కొత్త టైటిల్ ఏది అనేది మాత్రం ఈ నెలాఖరు వరకు ఆగితే తెలియొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :