నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం ఓ సీనియర్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి చూపు విజయశాంతి వైపు ఉందని.. బాలయ్య – విజయశాంతి కలయిక మళ్లీ కుదిరితే అదిరిపోతోందని బోయపాటి ఫీల్ అవుతున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
కాగా ఈ సినిమా మొత్తంలోనే ఈ రోల్ మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య అఘోర పాత్ర పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.


