నాగచైతన్య ‘కస్టడీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

Published on May 1, 2023 9:21 pm IST


అక్కినేని నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న తాజా ద్విభాషా సినిమా కస్టడీ. యక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా అరవింద్ స్వామి నెగటివ్ రోల్ చేస్తున్నారు. ప్రేమి విశ్వనాధ్, శరత్ కుమార్, ప్రియమణి, ,సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి ఎస్ ఆర్ కథిర్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే విషయం ఏమిటంటే, మే 5న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కాగా ఈ మూవీని సమ్మర్ కానుకగా అన్ని కార్యక్రమాలు ముగించి మే 12న గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :