“ఆదిపురుష్” ట్రీట్ పై డౌట్స్..?

Published on Apr 18, 2021 12:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై కూడా ఎనలేని అంచనాలు ఉన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ రామనవమి రోజున వస్తుంది అని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. దాదాపు అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ కానీ మరే ఇతర పోస్టర్ వస్తుంది అని గాసిప్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ ఒక్కసారిగా మారిపోతుండడంతో ఆ స్పెషల్ ట్రీట్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ మొదలయ్యాయి. మరి దీనికి సంబంధించి ఏం జరగనుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :