స్పార్క్ ఓటిటిలో రిలీజ్ కి రెడీగా ఉన్న “బిగ్ బాస్” బ్యూటీ సినిమా.!

Published on May 18, 2021 10:26 am IST

గత ఏడాదిలోనే మళ్ళీ ఈ ఏడాది కూడా కరోనా దెబ్బకు పలు ఆసక్తికర చిత్రాలు నేరుగా ఓటిటిలో విడుదలకు రావడానికి సిద్ధం అయ్యాయి. అలా పలు ఓటిటి యాప్స్ కూడా వచ్చాయి. వాటిలో లేటెస్ట్ యాప్ స్పార్క్ ఓటిటి కూడా ఒకటి. మరి దీనిలోనే లేటెస్ట్ గా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “డి” చిత్రం రిలీజ్ అయ్యింది.

ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. బిగ్ బాస్ బ్యూటీ దివి వద్య మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “స్పార్క్ ఓటిటి”. ఈ చిత్రానికి కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఈ వచ్చే మే 28న నేరుగా ఓటిటిలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందివ్వగా ఎస్ కృష్ణ నిర్మాణం వహించారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :