బజ్..”కేజీయఫ్ 2″ రన్ టైం అంతా..?

Published on May 4, 2021 12:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆల్రెడీ షూట్ కంప్లీట్ కాబడిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కోసం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఓ లెవెల్లో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సంబంధించిన రన్ టైం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కట్స్ కాకుండా ఈ చిత్రం తాలూకా మొత్తం రఫ్ రన్ టైం 2 గంటల 52 నిమిషాలు వచ్చిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత మేర నిజముందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో అధీరాగా సంజయ్ దత్ నటించగా ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ భారీ చిత్రాన్ని హోంబలే నిర్మాణ సంస్థ వారు తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :