మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్.!

Published on May 4, 2021 8:01 pm IST

రీసెంట్ గా అనౌన్స్ కాబడిన చిత్రాల్లో మంచి హైప్ సెట్ చేసిన సెన్సేషనల్ కాంబో సూపర్ స్టార్ మహేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఇప్పటి నుంచే మహేష్ ఫ్యాన్స్ సహా ఈ కాంబో అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సమయంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మహేష్ ఒక రా ఏజెంట్ గా కనిపిస్తాడని అంతే కాకుండా మహేష్ ఇది వరకు ఏ సినిమాలో కూడా కనిపించని విధమైన స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఈ గాసిప్ అయితే ఈ సినిమా సబ్జెక్టు పరంగా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అయితే మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ ఫ్లిక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :