“బిగ్ బాస్ సీజన్ 5” పై నయా గాసిప్స్.!

Published on Jun 6, 2021 7:00 pm IST

ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.తెలుగులో ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో మన ఇండియా లోనే ఏ భాషలో కూడా రాని భారీ సక్సెస్ రేట్ తెచ్చుకుంది.

అందుకే సీజన్ 5 కోసం కూడా తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రానున్న మోస్ట్ అవైటెడ్ సీజన్ పై నయా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈసారి సీజన్ వచ్చే జూలై లో కానీ ఆగష్టు లో కానీ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

అలాగే హోస్ట్ పరంగా కూడా చాలానే ప్రశ్నలు ఉన్నాయి కానీ మేకర్స్ మాత్రం మళ్ళీ కింగ్ నాగ్ నే ఫిక్స్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీజన్ 3 మరియు సీజన్ 4 ని అద్భుతంగా రక్తి కట్టించిన నాగ్ ఈసారి కూడా చేస్తారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సీజన్ ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :