“పుష్ప” క్లైమాక్స్ పై నయా గాసిప్స్.!

Published on Jun 19, 2021 4:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ హీరోయిన్ రష్మికా మందున్నాల కాంబినేషన్ లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇపుడు చివరి దశ షూటింగ్ లో ఉంది. మరి ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలు షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై నయా గాసిప్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రానికి గాను కీలక క్లైమాక్స్ షూట్ ను విదేశాల్లో ప్లాన్ చెయ్యాలని సుకుమార్ అనుకుంటున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే పలు లొకేషన్స్ పరిగణలో ఉన్నాయని కూడా తెలుస్తుంది. అక్కడ భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట.

అయితే దీనిలో ప్రస్తుతానికి అయితే ఎలాంటి నిజమూ లేనట్టు తెలుస్తుంది. పైగా చైనా, థాయిలాండ్ అనే పదాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో అలాంటి లొకేషన్స్ వెళ్లి చెయ్యడం అనేది ఎంత వరకు సాధ్యమో చూడాలి.. లేదా ఇదంతా జస్ట్ రూమర్ మాత్రమే అనుకోవాలి.

సంబంధిత సమాచారం :