“వకీల్ సాబ్” టీజర్ పై లేటెస్ట్ గాసిప్స్.!

“వకీల్ సాబ్” టీజర్ పై లేటెస్ట్ గాసిప్స్.!

Published on Dec 17, 2020 11:00 PM IST

Vakeel Saab1 1

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న “వకీల్ సాబ్” సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ దాని కంటే ముందే ఈ సినిమా టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

లాస్ట్ టైం పవన్ బర్త్ డే సందర్భంగా వస్తుంది అనుకుంటే అప్పుడు మేకర్స్ జస్ట్ మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టారు. మరి టీజర్ ఎప్పుడా అన్న చర్చ వస్తున్న సమయంలో దీనిపై పలు గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తాలూకు టీజర్ నూతన సంవత్సర పండుగ సందర్భంగా విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అంటే ఈ డిసెంబర్ 31 “వకీల్ సాబ్” టీజర్ వస్తుంది అని చెప్పాలి. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఒకవేళ వస్తే సరికొత్త ఏడాదికి బ్లాస్ట్ గట్టిగానే ఉంటుందని చెప్పాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు చాలానే మార్పులు చేర్పులతో చాలా బాగా ప్లాన్ చేసారని కూడా తెలుస్తుంది. మరి ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు