ఓటిటిలోకి వచ్చేసిన సంచలన హారర్ హిట్ ‘అబ్సెషన్’.. ఇండియన్ ఆడియెన్స్ కి ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్!

ఓటిటిలోకి వచ్చేసిన సంచలన హారర్ హిట్ ‘అబ్సెషన్’.. ఇండియన్ ఆడియెన్స్ కి ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్!

Published on Jul 11, 2026 11:00 AM IST

ఇటీవల హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చి ఒక సంచలన హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటే ‘అబ్సెషన్’. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా మామూలు రేంజ్ హిట్ అవ్వలేదు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి రికార్డు లాభాలు ఈ సినిమా అందుకుంది. అంతేనా ఇండియన్ మార్కెట్ లో కూడా ఈ సినిమా ఎలాంటి డబ్బింగ్ వెర్షన్ లేకుండానే సుమారు 80 కోట్లకి పైగానే గ్రాస్ ని రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ రేంజ్ హిట్ అయ్యిన ఈ సినిమా కొన్నాళ్ల కితమే డిజిటల్ గా కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాకి ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నిన్న (జూలై 10) నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది కానీ ఇక్కడే చిన్న మెలిక ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ తో వచ్చింది.

ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటిలో కేవలం రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది. సో 299 చెల్లించి చూడాలి. ఇక ఇదే కాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రాన్ని హిందీ డబ్బింగ్ లో కూడా తీసుకొచ్చారు. కానీ ఇతర డబ్బింగ్ వెర్షన్ లని ఆశించినవారికి మాత్రం బ్యాడ్ న్యూస్ ఇది అని చెప్పక తప్పదు.

సో ఇండియాలో కేవలం హిందీ, అది కూడా రెంటల్ లో చూడాలి అనుకునేవారు ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి కర్రీ బర్కర్ అనే యువ దర్శకుడు పని చేయగా మైఖేల్ జాన్స్టన్, ఇండే నవారెట్టే లీడ్ పాత్రల్లో నటించారు. వీరిలో ఇండే నటనకి వరల్డ్ వైడ్ గా మంచి అప్లాజ్ వచ్చింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు