లేటెస్ట్..తెలంగాణాలో 5 షోలకు అనుమతి..మరిన్ని వివరాలు

Published on Aug 10, 2021 7:50 pm IST

గత ఏడాది కరోనా వల్ల సినిమా మరియు దానినే నమ్ముకున్న థియేట్రికల్ సంస్థకి కూడా ఎంతటి నష్టం వాటిల్లిందో మనకి తెలుసు ఇక మెల్లగా కరోనా ప్రభావం తగ్గే నాటికే అనేక థియేటర్స్ మూత కూడా పడ్డాయి. అయితే ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పలు రకాలుగా వారికి అండగా ఉన్నారు. మరి మళ్ళీ రెండో వేవ్ కి థియేటర్స్ మూతపడి ఇప్పుడు తెరుచుకుని సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.

మరి తాజాగా తెలంగాణా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈరోజు బి ఆర్ కె భవన్ లో జరిగినటువంటి మీట్ లో తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పలు కీలక నిర్ణయాలపై చర్చించడమే కాకుండా తెలంగాణాలో థియేటర్స్ వారు రోజూ 5 షోలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టుగా కూడా క్లారిటీ ఇచ్చారు.

అలాగే సింగిల్ విండో సిస్టం కి కూడా అనుమతులు ఇవ్వడమే కాకుండా లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ యాజమాన్యం చెల్లించాల్సిన పన్నులు రద్దుపై కూడా చర్చ జరిపి ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. మరి ఇక నుంచి ముందు రోజుల్లో తెలంగాణాలో రోజు 5 షోలు పడటం పక్కా అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :