అలా అయితే “కేజీయఫ్ 2” కి రిలీజ్ డేట్ ఇదేనట.!

Published on Jun 23, 2021 2:59 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం అన్ని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా మంచి హాట్ టాపిక్ గా మారిపోయింది.

అలా ఎన్నో విడుదల తేదీలు బయటకి వచ్చిన నేపథ్యంలో ఆఖరికి ఓ డేట్ ఖరారు అయ్యినట్టు సినీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. మరి దాని ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీ వచ్చే సెప్టెంబర్ 9 కి ఫిక్స్ అయ్యిందట. అది కూడా అప్పటికి ఇండియాలో కనుక కరోనా మూడో వేవ్ టచ్ చెయ్యకపోతేనే ఆ డేట్ కి ఈ చిత్రం విడుదల అవుతుందట. మరి రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :