పవన్ ఆరోగ్యంపై తాజా సమాచారం వచ్చింది.!

Published on Apr 18, 2021 3:17 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” ఇప్పుడు ఒకపక్క సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ మరో పక్క పవన్ కరోనా బారిన పడ్డారు అని వచ్చిన వార్త షాక్ కు గురి చేసింది. అయితే పవన్ కోవిడ్ పాజిటివ్ అని తేలిన క్షణం నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కీలక వైద్యాన్ని కుటుంబీకులు అందిస్తున్నారు.

మరి ఇప్పుడు పవన్ ఆరోగ్యం పట్ల అధికారిక తాజా సమాచారం అలాగే పవన్ చెప్పిన మాటలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం అనారోగ్యం నిలకడగా ఉందని అంతే కాకుండా పవన్ కోసం ప్రార్ధనలు జరిపిన ప్రతీ ఒక్క అభిమానికి తన ఆరోగ్యం పట్ల స్పందించిన ప్రతీ ఒక్క నటులు సహా రాజకీయ నాయకులకు ధన్యవాదాలు పవన్ తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం కూడా కరోనా పట్ల అప్రమత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు మాస్కులు శానిటైజర్ లు తప్పనిసరిగా వినియోగిచాలని పవన్ సూచించారు.

సంబంధిత సమాచారం :