సర్కారు వారి ‘పాట’ వచ్చేది అప్పుడు కాదా.?

Published on Jul 13, 2021 7:40 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మహేష్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఈ సినిమాపై మంచి సెన్సేషన్ అవుతుంది. అయితే నిన్ననే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

రానున్న మహేష్ బర్త్ డే కి ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది అన్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా ఈ చిత్రంలోని మొదటి పాట కూడా అప్పుడే ఉండొచ్చని సంగీత దర్శకుడు థమన్ ఇది వరకే కన్ఫర్మ్ చేసాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్పుడు రాకపోవచ్చనే తెలుస్తోంది.. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :