లేటెస్ట్..”జెర్సీ” హీరోయిన్ కి కరోనా పాజిటివ్.!

Published on Jan 1, 2022 2:00 pm IST

ఆల్రెడీ కరోనా ప్రభావం మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రబలుతోంది. దీనితో మళ్ళీ డేంజర్ బెల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక దీనితో కొత్త టెన్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ఇదిలా ఉండగా దీనితో మళ్ళీ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా “జెర్సీ” కూడా ఒకటి. మరి ఈ సినిమా తోనే బాలీవుడ్ లో కొత్త సినిమాలు వాయిదా పడడం స్టార్ట్ అయ్యాయి.

మరి ఈ సినిమాకి గాను హీరోయిన్ గా బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. మరి ఇప్పుడు ఈమె కరోనా పాజిటివ్ అయ్యినట్టు తెలుస్తుంది. అది కూడా ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈమె ఐసోలేషన్ లో ఉందట. అలాగే ఆరోగ్యం కాస్త కుదురుగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఆ చేదు జ్ఞ్యాపకాలే అందరికీ గుర్తు వస్తున్నాయి కావున ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉంటే మంచిది.

సంబంధిత సమాచారం :