లేటెస్ట్..యంగ్ హీరో మాస్ కా దాస్ కి కరోనా పాజిటివ్!

Published on Dec 31, 2021 3:37 pm IST

ప్రెజెంట్ టాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. హీరోగా పరిచయం అయ్యాక ఆసక్తికర సినిమాలు ఎంచుకుంటూ ఇప్పుడు మరింత ఆసక్తికర లైనప్ ని సెటప్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తాను కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్టు కన్ఫర్మ్ చేసాడు. తన సోషల్ మీడియా ద్వారా తాను అనుకోని విధంగా కరోనా పాజిటివ్ కబడ్డానని, ప్రస్తుతానికి ఐసోలేషన్ లో అన్ని ప్రొటొకాల్స్ పాటిస్తున్నాని తెలిపాడు.

అలాగే తాను ఆల్రెడీ వాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా వచ్చింది అని ఇంకో షాకింగ్ విషయం రివీల్ చేసాడు. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించి ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పుడిప్పుడే మళ్ళీ కరోనా తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. ఇకనైనా అంతా మళ్ళీ జాగ్రత్తగా ఉంటే మంచిది. విశ్వక్ అయితే త్వరగా కోలుకోవాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :