ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా ?

Published on Mar 12, 2019 11:21 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం మార్చి 28న లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే షూటింగ్ మాత్రం ఎన్నికల తరువాతే స్టార్ట్ కానుంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, రాజకీయ నాయకుడి పాత్ర అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజా సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

ఇక ఈ ఏడాది బాలయ్య ‘కథానాయకుడు’ మరియు ‘మహానాయకుడు’తో, బోయపాటి ‘వినయ విధేయ రామ’తో భారీ డిజాస్టర్ లను చవి చూశారు. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ హిట్ అవుతుందో లేదో చూడాలి. అయితే ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా ?

సంబంధిత సమాచారం :