భారీ హిట్… కానీ హీరోయిన్ ఫట్ !

Published on Apr 26, 2019 4:20 pm IST

మొత్తానికి నాగ చైతన్య – సమంత మజిలీలో తమ పాత్రలకు ప్రాణం పోశారని.. శివ నిర్వాణ దర్శకత్వ పనితనం అద్భుతమని.. అలాగే సినిమాలో ప్రతి నటి, నటుడు చాలా బాగా నటించారని.. ఇలా మజిలీ సక్సెస్ ను ఉద్దేశించి చాలా మంది కొనియాడారు. అందుకు తగ్గట్లుగానే ‘మజిలీ’ చిత్రం మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు సాధించింది.

ఇక సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించిన సెకెండ్ హీరోయిన్ దివ్యంశ కౌశిక్ కే రావాల్సిన స్థాయిలో పేరు రాలేదు. నిజానికి ఆమె తన పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకుంది. కానీ మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది.

దాంతో దివ్యంశ కౌశిక్ పరిస్థితి చేసిన సినిమా భారీ హిట్.. తాను మాత్రం ఫట్ మాదిరిగా తయారయింది. ఒకపక్క సరైన హిట్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసినా దివ్యంశ కౌశిక్ కు మాత్రం ఇంకా సరైనా అవకాశాలు రావట్లేదు. దివ్యంశ కౌశిక్ తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఫీల్ అవుతుందట.

సంబంధిత సమాచారం :