డాక్టరేట్‌ అందుకోబోతున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ !

shobana

ఒకప్పటి అందాల నటి, బహుభాషా చిత్రాల్లో హీరోయిన్ గా రాణించిన ప్రముఖ నాట్యకళాకారిణి శోభన. తాజాగా ఆమె డాక్టరేట్‌ అందుకోబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎంజీఆర్‌ విద్యా పరిశోధన సంస్థ గౌరవ డాక్టరేట్‌ ను ప్రకటించింది. ఎంజీఆర్‌ విద్య, పరిశోధన సంస్థ అధినేత ఏసీ.షణ్ముగం నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.

కాగా ఈ కార్యక్రమంలో విక్రం సారాబాయ్, స్పేస్‌ డైరెక్టర్‌ సోమనాథ్, నటి, భరతనాట్యకళాకారిణి శోభన, సంగీత దర్శకుడు హరీశ్‌జయ రాజ్‌లను గౌరవ డాక్టరేట్‌లతో ఘనంగా సత్కరించనున్నారు. కార్యకమంలో రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఒక శోభన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె ఇంతవరకు వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకే అంకితం ఇవ్వడం విశేషం.

Exit mobile version