నటి ఇంట్లో విగతజీవిగా వ్యాపారవేత్త !

నటి ఇంట్లో విగతజీవిగా వ్యాపారవేత్త !

Published on Jun 25, 2026 6:33 PM IST

కన్నడ సినీ పరిశ్రమలో నటిగా కృషి తాపండాకి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ప్రేక్షకులకు ఆమె బాగానే పరిచయం. అలాంటి నటి ఇంట్లో ఓ వ్యాపారవేత్త విగతజీవిగా కనిపించడం ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. అసలేం జరిగింది ? అంటూ కన్నడ సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. వ్యాపారవేత్త వైశాఖ్‌.. సదరు నటి నివాసంలో ఉరివేసుకున్నాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా… సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వైశాఖ్‌ సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం.. ఫ్యామిలీ మరియు ఆర్థిక ఇబ్బందులు అని తెలుస్తోంది. వ్యక్తిగత వివాదాల కారణంగా నెల క్రితం భార్య నుంచి వేరుపడి నటి కృషి తాపండా ఇంట్లోనే అతను ఉంటున్నాడు.

కానీ, అంతలో ఏం జరిగిందో ఏమో.. సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఐతే, ఘటన సమయంలో నటి కృషి తాపండా.. ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అతడి మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోవైపు కృషి తాపండా పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. నటిగా అవకాశాలు లేక, ఆమె ఇలా తన ఇంట్లోనే తప్పుడు పనులు చేస్తోందని.. అసలు కృషి తాపండా పనే పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి.. వారిని తన అందాల వలలో బంధించడమే ఆమె పని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు