లేటెస్ట్..బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ కు కరోనా పాజిటివ్.!

Published on Mar 24, 2021 12:47 pm IST

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా చెయ్యకుండా భారీ వసూళ్లను రాబట్టగలిగే స్టార్ హీరోలలో అమీర్ ఖాన్ కూడా ఒకరు. మరి ఇదిలా ఉండగా మళ్ళీ మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. గత ఏడాది కూడా ఈ టైం లోనే పెరుగుతూ వచ్చిన కరోనా మళ్ళీ ఈసారి కూడా రెండో వేవ్ తో ఊపందుకుంది.

ఆ క్రమంలోనే పలువురు బాలీవుడ్ స్టార్స్ కు కరోనా పాజిటివ్ రాగా ఇప్పుడు అమీర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పుడు అమీర్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో అమీర్ తన స్టాఫ్ ను కూడా కరోనా టెస్ట్ చేయించుకోని విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. మరి అమీర్ ఖాన్ త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :