నయన్ ‘ఐరా’ తెలుగులో కూడా అదే రోజు !

నయన్ ‘ఐరా’ తెలుగులో కూడా అదే రోజు !

Published on Mar 17, 2019 10:24 PM IST

iyera1

లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి సారి డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రం ‘ఐరా’. ఫ్యామిలీ ,హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సర్జున్ డైరెక్ట్ చేసిన ఈచిత్రం మార్చి 28న విడుదలకానుంది. అదే రోజు ఈ చిత్రం తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. ఇక వరుస విజయాలతో నయన్ సూపర్ ఫామ్ లో ఉండడంతో కోలీవుడ్ లో ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది.

కేజేఆర్ స్టూడియోస్ , ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందరమూర్తి సంగీతం అందించారు. ఇక నయనతార ఈచిత్రంలో మొదటిసారి డీ గ్లామరైజ్డ్ రోల్ లో కనిపించనుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు