పాటతో ఆకట్టుకున్న ‘అర్జున్ సురవరం’ !

పాటతో ఆకట్టుకున్న ‘అర్జున్ సురవరం’ !

Published on Mar 13, 2019 3:00 AM IST

నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ హీరోగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘అర్జున్ సురవరం’. కాగా తాజాగా ఈ చిత్రం యొక్క మొదటి పాట ‘కన్నే కన్నే’ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.

ప్రసుతం ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సామ్ సి ఎస్ పాటను కంపోజ్ విధానం, అలాగే సింగర్స్ నుండి ఆయన రాబట్టుకున్న పనితనం కారణంగా సాంగ్ బాగా ఇంప్రెస్స్ చేస్తోంది.

ఇక మార్చి 29న విడుద‌ల అవుతున్న ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు