ఈ సినిమా మొదలయ్యేది ఎప్పుడో ?

Published on Mar 13, 2019 12:30 am IST

‘బాణం’ సినిమానితో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు చెైతన్య దంతులూరి. చెైతన్య దర్శకత్వంలో ‘నారా రోహిత్’ హీరోగా ఓ సినిమా అనుకున్న విషయం తెలిసిందే. 1971 కాలంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఎప్పుడో మొదలవ్వాలి. అందుకు తగ్గట్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుంది. అయినా ఈ సినిమా ఇంకా మొదలవ్వలేదు. అయితే స్క్రిప్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందని, ఈ సారి చైతన్య హిట్ కొట్టడం గ్యారింటీ అని తెలుస్తోంది.

ఇక ఒక దర్శకుడిగా చెైతన్య దంతులూరి తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. మరి ఈ సారీ అన్నా కమర్షియల్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More