స్క్రిప్ట్‌ ల పై కమర్షియల్ డైరెక్టర్ వర్కౌట్స్ !

Published on May 17, 2021 9:16 am IST

దర్శకుడు మారుతి ప్రస్తుతం గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెబుతూ.. ‘నేను ఈ సెకెండ్ వేవ్ లాక్ డౌన్ లో స్క్రిప్ట్‌ లే ఎక్కువగా రాసుకుంటున్నాను. వెబ్‌ సిరీస్‌ల కోసం స్క్రిప్ట్‌లు ఏమైనా రాస్తున్నారా? అని అడిగితే.. ‘త్రీ రోజెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ కోసం మూల కథని ఇచ్చానంతే. దాని చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. అయితే ప్రస్తుతం నేను రాస్తున్నవి సినిమా కథలే. పూర్తిగా కథపైనే దృష్టిపెట్టే ఇలాంటి నాణ్యమైన సమయం మళ్లీ దొరకదు కదా.

భవిష్యత్తులో నాణ్యమైన సినిమాలు తీయకపోతే కష్టం. మంచి కాన్సెప్ట్‌లు వస్తున్నాయి. ఈమధ్య చూసినవాటిలో ‘సినిమా బండి’ బాగా తీశారు అనిపించింది. అలా మంచి స్క్రిప్టులతో, మనమూ మరింత బాధ్యతతో సినిమాలు చేయాలి. దానిపైనే నా దృష్టం అంటూ మారుతి చెప్పుకొచ్చాడు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు మారుతి చాలా రోజుల గ్యాప్ తర్వాత గోపీచంద్ హీరోగా దే ‘పక్కా కమర్షియల్ అంటూ మరో ఎంటర్ టైనర్ తీస్తున్నాడు.

సంబంధిత సమాచారం :