లేటెస్ట్ : కమల్ కి అస్వస్థత..ఆరోగ్య వివరాలు ఇవే.!

లేటెస్ట్ : కమల్ కి అస్వస్థత..ఆరోగ్య వివరాలు ఇవే.!

Published on Nov 24, 2022 10:00 AM IST

ఇండియన్ సినిమా దిగ్గజ నటుల్లో ఒకరైనటువంటి స్టార్ హీరో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్” తో తాను భారీ హిట్ అందుకోగా ఇప్పుడు మరో భారీ చిత్రం “ఇండియన్ 2” షూటింగ్ లో తాను బిజీగా ఉన్నారు. అయితే నిన్ననే లెజెండరీ దర్శకులు కళా తపస్వి కే విశ్వనాధ్ ని కలిసిన ఫోటో కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యింది.

అయితే ఇదంతా బాగానే ఉండగా లేటెస్ట్ గా కమల్ ఆరోగ్యానికి సంబంధించి ఓ ఊహించని అప్డేట్ అయితే బయటకి వచ్చింది. కమల్ నిన్న సాయంత్రం కొద్ది పాటి జ్వరం మరియు జలుబుతో హాస్పిటల్ లో చెకప్ చేయించుకున్నారని తెలిసింది. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని లేదట.

కమల్ ఈరోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోయారట. కాకపోతే వైద్యులు కొద్ది రోజులు పాటు రెస్ట్ అయితే తీసుకోవాలని సూచించారట. మరి దీనితో అయితే కమల్ ఫ్యాన్స్ కంగారు పడక్కర్లేదని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు