కాంచన 3 రిలీజ్ డేట్ ఫై క్లారిటీ వచ్చింది !

కాంచన 3 రిలీజ్ డేట్ ఫై క్లారిటీ వచ్చింది !

Published on Mar 14, 2019 10:32 PM IST

సూపర్ హిట్ హార్రర్ థ్రిల్లర్ ముని సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మొదట మే 1న విడుదలకానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విడుదల తేదీ ఫై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయాన్నామని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ తో కలిసి లారెన్స్ తన సొంత బ్యానర్ రాఘవేంద్ర ప్రొడక్షన్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వేదిక , బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు