‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అప్పుడే !

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల అప్పుడే !

Published on Jan 23, 2019 8:50 PM IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేసిన వర్మ… అలాగే లక్ష్మి పార్వతి, చంద్రబాబుకు సంబంధించిన లుక్స్ ను సెట్ ఫొటోస్ ను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మొత్తానికి సినిమా పై బాగానే అంచనాలు పెంచుతున్నాడు.

కాగా తాజాగా ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను మార్చిలో విడుదల చేయబోతున్నామని.. అలాగే ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు