ప్రభాస్ ‘ది రాజా సాబ్’ లేటెస్ట్ అప్ డేట్

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ లేటెస్ట్ అప్ డేట్

Published on May 11, 2025 12:10 PM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
కాగా వచ్చే వారంలో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్ ను కూడా ఏర్పాటు చేశారట. ప్రభాస్ కేవలం ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇస్తే సినిమా పూర్తయిపోతుంది.

ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది. అన్నట్టు ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు