శృంగారతారగా ఎంతో ఇష్టపడి చేశా – రమ్యకృష్ణ

Published on Mar 12, 2019 1:47 am IST

త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో సమంత ,రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి, మిస్కిన్ ముఖ్య పాత్రల్లో రాబోతున్న సినిమా ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రా పాత్రను పోషిస్తుండగా.. రమ్యకృష్ణ శృంగారతారగా నటిస్తోంది. కాగా తాజాగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ..’ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని చూసి సెట్‌ లో ఉన్నవాళ్ళంతా షాకయ్యారు. ఎందుకంటే ఆ సన్నివేశం కోసం నేను ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నాను. మాకు ఆ సన్నివేశాన్ని పూర్తిచేయడానికి దాదాపు రెండు రోజులు పట్టింది.

రమ్యకృష్ణ ఇంకా మాట్లాడుతూ.. ‘మా నటీనటులెవమైనా జీవితంలో కొన్ని పాత్రలను డబ్బు కోసం చేస్తాం. మరికొన్ని పేరుప్రఖ్యాతల కోసం చేస్తాం, ఇంకొన్ని ఎంతో ఇష్టంతో చేస్తాం. అలా చేసిందే ఈ సినిమాలో పాత్ర అని చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ.

సంబంధిత సమాచారం :

More