స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఎన్టీఆర్ వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. భారీ విజయాలతో దూసుకువెళ్తున్నాడు, అయితే ఈ సినిమాలో నటించిన జగపతిబాబు, నవీన్ చంద్ర, శతృ లాంటి వారికి కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరోయిన్ ఈషా రెబ్బాకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు.
కాగా, ఈ సినిమాలో ఈషా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కేవలం మూడు నాలుగు సీన్స్ కు మాత్రమే పరిమితమయ్యింది. వాస్తవానికి ఈషా పై ఎక్కువ సీన్స్ షూట్ చేసినప్పటికీ.. సినిమా నిడివి ఎక్కువడం కారణంగా త్రివిక్రమ్ ఇషా రెబ్బ ఉన్న సీన్స్ ని ఎడిటింగ్ లో తొలిగించారట. దాంతో ఈషాకి అనుకున్నంతగా పేరు రాలేదు.
ప్రస్తుతం ఈషా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చిత్రంలో నటించనుంది. లక్కీ గోపాల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత కిరణ్ కుమార్ నిర్మించనున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ‘అజనీష్.బి.లోకనాథ్’ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా మన తెలుగు హీరోయిన్, కన్నడంలో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.