‘మామ అల్లుళ్లు’ కామెడీ టైమింగ్ బాగుందట !

Published on Mar 13, 2019 3:57 am IST

విక్టరీ వెంకటేష్ – యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తోన్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా ఇంట్రస్ట్ గా ఉండనుందట. పల్లెటూరిలో రైసు మిల్లు నడుపుకునే వ్యక్తి పాత్రలో వెంకీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే ఆ పల్లెటూరి సన్నివేశాలు చాలా బాగా అలరిస్తాయట.

ప్రస్తుతం చిత్రబృందం ఆ సన్నివేశాలనే షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మామ అల్లుళ్లు’ ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటుస్తున్నారని.. ఇద్దరి మధ్య కామెడీ టైమింగ్ చాలా బాగా కుదురుతుందని తెలుస్తోంది. గతంలోనే ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది.

కాగా ‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More