విజయ్ 64 కి దర్శకుడు ఖరారు !

Published on Mar 15, 2019 3:54 am IST

తమిళ స్టార్ హీరో విజయ్ తన 64 వ చిత్రాన్ని ‘తని ఒరువన్’ ఫేమ్ మోహన్ రాజా తో చేయనున్నాడు. ఈ చిత్రానికి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. గతంలో విజయ్ -మోహన్ రాజా కాంబినేషన్ లో ‘వేలాయుధం’ అనే చిత్రం తెరకెక్కింది.

ఇక విజయ్ ప్రస్తుతం తన 63 వచిత్రంలో నటిస్తున్నాడు. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ దీపావళికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More