లేటెస్ట్..పవర్ స్టార్ సినిమా 8 రోజులకే స్ట్రీమింగ్ లో.!

Published on Apr 8, 2021 3:00 pm IST

రేపే మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్” సినిమా థియేట్రికల్ గా విడుదల కానుంది మళ్ళీ 8 రోజులకే స్ట్రీమింగ్ లోకి ఏంటి అనుకోవద్దు. ఇది తెలుగు పవర్ స్టార్ సినిమా కాదు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా.

తాను నటించిన లేటెస్ట్ చిత్రం “యువరత్న” గత వారమే కన్నడ మరియు తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. కన్నడ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం జస్ట్ వారం అయ్యిన వెంటనే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకి రెడీ అయ్యిపోయింది.

అయితే ఈ చిత్రం కరోనా కారణంగానే కేవలం 8 రోజుల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తెచ్చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేజీయఫ్ నిర్మాతలు నిర్మాణం వహించారు. అలాగే సాయేషా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రేపు తెలుగు, కన్నడ తమిళ్ మరియు హిందీ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుంది.

సంబంధిత సమాచారం :