లేటెస్ట్ : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించిన నిర్మాత దానయ్య

లేటెస్ట్ : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించిన నిర్మాత దానయ్య

Published on Feb 24, 2024 2:23 AM IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీని సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ గామా అవార్డ్స్ ప్రెస్ మీట్ లో భాగంగా ఓజి నిర్మాత దానయ్య మాట్లాడుతూ, ఓజి పక్కాగా తాము ప్రకటించిన టైంకే ఆడియన్స్ ముందుకి వస్తుందని, ఏప్రిల్ లో ఎలక్షన్స్ అనంతరం ఓజి బ్యాలెన్స్ షూటింగ్ ని పవన్ కంప్లీట్ చేయనున్నారని తెలిపారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు