‘ఆల్ఫా’లో మరో క్రేజీ కామియో? ఇద్దరు టైగర్స్ లో ఎవరు?

‘ఆల్ఫా’లో మరో క్రేజీ కామియో? ఇద్దరు టైగర్స్ లో ఎవరు?

Published on Jun 18, 2026 11:30 PM IST

ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెక్స్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమానే “ఆల్ఫా”. ఆలియా భట్ లీడ్ రోల్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది రాబోతోంది. ఇటీవల వచ్చిన టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకోగా ఇందులో తమ స్పై యూనివర్స్ హీరో హృతిక్ రోషన్ కామియో ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

దీంతో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లగా లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది. ఇందులో మరో సర్ప్రైజ్ కామియో కూడా ఉండే ఛాన్స్ ఉందని టాక్ మొదలైంది. దీని ప్రకారం అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేదా టైగర్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కనిపించే అవకాశం ఉందని కొన్ని ఊహాగానాలు ఇపుడు మొదలయ్యాయి.

సో దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. సల్మాన్ కామియో ఉంటే అది రెగ్యులర్ నే కానీ ఎన్టీఆర్ కామియో ఉంటే మాత్రం అది పాన్ ఇండియా లెవెల్లో మంచి రీచ్ ని సొంతం చేసుకుంటుంది అని చెప్పొచ్చు. సో ఆలియా ఆల్ఫాలో ఇంకెవరు ఉన్నారో తెలియాలి అంటే ఈ జూలై 3 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు