లేటెస్ట్..సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్.!

Published on Mar 27, 2021 1:30 pm IST

ఇప్పుడు మన దేశంలో మళ్ళీ కరోనా రెండో వేవ్ పెద్ద స్థాయిలో విజృంభిస్తుంది. ముఖ్యంగా సినీ వర్గాల్లో ఐటీ బాలీవుడ్ అనేక మంది స్టార్ నటులు ఈ మధ్యనే తమకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిపారు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా క్రికెట్ హిస్టరీ ఇండియన్ ఫ్యాన్స్ కు డెమి గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా అధికారికంగా ప్రకటించారు.

తనకి కొద్దీ పాటి కరోనా లక్షణాలు అనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని అందులో రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అలాగే తనకు మాత్రమే పాజిటివ్ వచ్చింది తప్పితే మిగతా ఇంటి సభ్యులకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతానికి క్వారంటైన్ లో వైద్యుల సలహా మేర చికిత్స తీసుకుంటున్నాని తన ఆరోగ్యం కోసం కేర్ తీసుకుంటున్న వైద్యులకు అలాగే దేశ వ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాని ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండమని సచిన్ కోరారు. మరి సచిన్ త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :