పక్కా హిట్ నెంబర్ గా “పక్కా కమర్షియల్” లేటెస్ట్ సాంగ్..!

Published on Jun 1, 2022 4:06 pm IST

మన టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా గ్లామరస్ హీరోయిన్ రాశి ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా “పక్కా కమర్షియల్”. మంచి బజ్ నెలకొల్పుకున్నా ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ నెంబర్ “అందాల రాశి” ని రిలీజ్ చేశారు.

అయితే గత కొన్ని రోజులు కితం ఈ సాంగ్ తాలూకా ప్రోమో ని రిలీజ్ చెయ్యగా అది మంచి క్యాచీగా అనిపించింది. కానీ ఇపుడు వచ్చిన ఫుల్ లిరికల్ సాంగ్ మాత్రం దానికన్నా చాలా బెటర్ బీట్ తో పక్కా హిట్ నెంబర్ గా నిలుస్తుందనిపిస్తుంది. చాలా క్లీన్ అండ్ నీట్ గా సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ సాంగ్ ని ఫస్ట్ టైం వినడంతోనే నచ్చే విధంగా కంపోజ్ చేసాడు.

అలాగే శ్రీ చరణ్ మరియు, రమ్య బెహరా వాయిస్ లు కూడా ఈ సాంగ్ కి చాలా బాగున్నాయి. ఇంకా ఇందులో ముందు చెప్పినట్టుగానే సాంగ్ సెటప్ గోపీచంద్, రాశి ఖన్నాల లుక్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా అయితే ఈ సాంగ్ ఒక ఇన్స్టంట్ హిట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాణం వహించగా జూలై 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :