“అఖండ” లో ఒక్క యాక్షన్ పార్ట్ కే ఇన్ని రోజులా.?

Published on Aug 12, 2021 9:42 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకుడు “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బాలయ్య మరియు బోయపాటిల కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.

అలాగే హ్యాట్రిక్ సినిమానే అని కాకుండా వీరి కాంబో అంటేనే అదిరే పంచ్ డైలాగులు మరియు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు.. మరి అలాంటి హ్యాట్రిక్ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయ్? వాటికి తగ్గట్టుగానే బోయపాటి గట్టిగానే కొట్టనున్నారని తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడొక టాక్ నడుస్తుంది.

ఈ చిత్రంలో ఉన్నటువంటి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ లు కోసమే రెండున్నర నెలలకి పైగా కేటాయించారట.. దీనిని బట్టి ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :